Porn Rocket Case: రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు..?

by Rani Yarlagadda |
Porn Rocket Case: రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు..?
X

దిశ, వెబ్ డెస్క్: పోర్న్ రాకెట్ కేసు (Porn Rocket Case)లో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పీశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు సంబంధం ఉందని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. రేపు (సోమవారం) రాజ్ కుంద్రా (Raj Kundra)ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయన్న విషయాలపై ఆరా తీయనున్నారు ఈడీ ఆఫీసర్లు. మరోవైపు ఈ కేసులో సంబంధం ఉన్న మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

పోర్న్ వీడియోలను తలపించేలా సినిమాలను తీసి.. పలు యాప్ ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని 2021లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Mumbai Crime Branch Police) కేసు నమోదు చేశారు. ఆ కేసులో రాజ్ కుంద్రా అరెస్టయ్యారు. కొన్ని నెలలపాటు జైల్లో ఉన్నాక బెయిల్ పై బయటికొచ్చారు. నిజానికి ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. ఇటీవలే ఈడీ సోదాలు చేసిందని వార్తలు రాగా.. వాటిలో నిజం లేదన్నారు అతని తరఫు న్యాయవాది. ఆ తర్వాత నిజాలను మాత్రమే ప్రసారం చేయాలని, నాలుగేళ్లుగా ఈ కేసుకు తాను సహకరిస్తున్నానని, తన భార్య పేరును పదే పదే ఇందులో వాడటం ఆమోదయోగ్యం కాదని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed