J&K: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి

by Harish |
J&K: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జమ్మూకశ్మీర్ లోయలో భారత భద్రత దళాలు చేపడుతున్న సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా బుధవారం ఉదంపూర్‌లోని కతువా-బసంత్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ప్రాంతంలో జైషే మహ్మద్ (జేఎం) గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కుంబింగ్ ప్రారంభించగా ఇరువర్గాల మధ్య తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. నిర్దిష్ట సమాచారం ఆధారంగా కథువాలో ఉమ్మడి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని కథువా-బసంత్‌గఢ్ సరిహద్దును మొత్తం చుట్టిముట్టి రెండు వైపుల నుండి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో భద్రత బలగాలు తమ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. సైన్యానికి చెందిన 1 పారా, 22 గర్హ్వాల్ రైఫిల్స్, కేంద్రపాలిత ప్రాంత పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (SOG) ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇదిలా ఉంటే జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా స్థానిక పోలీసులు, భారత ఆర్మీ సంయుక్తంగా కలిసి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

Advertisement

Next Story