Election Results-2024: హర్యానాలో కౌంటింగ్ షురూ.. పలుచోట్ల కాంగ్రెస్ హవా

by Shiva |   ( Updated:2024-10-08 03:20:53.0  )
Election Results-2024: హర్యానాలో కౌంటింగ్ షురూ.. పలుచోట్ల కాంగ్రెస్ హవా
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారనే ఉత్కంఠ అక్కడి ప్రజల్లో నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు 90 అసెంబ్లీ స్థానాలకు గాను 93 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాద్‌షాపూర్, గురుగ్రామ్, పటౌడీలో మాత్రమే రెండు చొప్పున కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. మిగిలిన 87 స్థానాలకు ఒక్కో కౌంటింగ్ కేంద్రం ఉండగా.. ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్‌లో స్పష్టంగా కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు 88 స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అందులో కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు 62 చోట్ల, బీజేపీ (BJP) అభ్యర్థులు 24 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక జులానా నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన వినేష్ ఫోగట్ ముందజలో కొనసాగడం విశేషం. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత భూపేంద్ర సింగ్ హుడా లీడ్‌లో కొనసాగుతున్నారు. లాడ్వాలో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed