- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోక్ సభకు 73 మంది మహిళలు.. గతేడాతో పోలిస్తే ఎంతతక్కువంటే?
దిశ, నేషనల్ బ్యూరో: ఈసారి లోక్ సభ ఎన్నికల్లో 73 మంది మహిళలు గెలుపొందారు. మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు బరిలో దిగగా.. 73 మంది విజయం సాధించారు. గతేడాతో పోలిస్తే ఐదుగురు తక్కువగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 78 మంది మహిళలు ఎంపీలుగా గెలుపొందారు.
అత్యధికంగా ఏ పార్టీ నుంచి మహిళలు గెలిచారంటే?
ఈసారి, లోక్ సభలో మహిళల వాటా 13.44 శాతంగా ఉంది. అత్యధికంగా బీజేపీ నుంచి 30 మంది మహిళా అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి 14 మంది, టీఎంసీ నుంచి 11 మంది, సమాజ్ వాదీ పార్టీ నుంచి నలుగురు మహిళలు ఎంపీలుగా గెలిచారు. డీఎంకే నుంచి ముగ్గురు, జేడీయూ, ఎల్జేపీఆర్ నుంచి ఇద్దరు చొప్పున మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. భారత ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. అత్యధికంగా 2019లో 78 మంది మహిళా ఎంపీలు గెలుపొందారు. 2014లో 64 మంది మహిళా ఎంపీలు ఉండగా.. అంతకు ముందు 52 మంది మహిళలు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.
గెలిచిన ప్రముఖులు ఎవరంటే?
లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించారు. బీజేపీ తరఫున నటి హేమమాలిని, టీఎంసీ నుంచి మహువా మొయిత్రా, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్ వాదీ పార్టీకి చెందిన డింపుల్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. రాజకీయనేతగా మారిన నటి కంగనా, లాలూ కుమార్తె మిసా భారతి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే గెలుపు సాధించారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన 25 ఏళ్ల ప్రియా సరోజ్, 29 ఏళ్ల ఇక్రా చౌదరి ఈసారి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పిన్నవయస్కులు కావడం విశేషం.