‘రూ.100 కోట్లు ఎక్కడివి’.. ఢిల్లీ CM కేజ్రీవాల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం..!

by Satheesh |   ( Updated:2024-03-26 04:51:29.0  )
‘రూ.100 కోట్లు ఎక్కడివి’.. ఢిల్లీ CM కేజ్రీవాల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌ను కస్టడీలో భాగంగా మూడవ రోజు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, రూ.100 కోట్ల ముడుపుల వ్యహహారంపై అధికారులు కేజ్రీవాల్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులిచ్చిన స్టేట్మెంట్లపైన అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. నిందితుల స్టేట్మెంట్లకు కేజ్రీవాల్ సమాధానాలకు పొంతన లేకపోవడంతో ఈడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో కలిపి కేజ్రీవాల్ విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురొంటున్న కేజ్రీవాల్‌ను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ నెల 23న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ను సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చిన ఈడీ.. కేసు విచారణలో భాగంగా ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన జడ్జి కేజ్రీవాల్‌ను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ అదుపులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed