- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఆదేశాల మేరకే ఈసీ పని చేస్తోంది: ఢిల్లీ మంత్రి అతిశీ తీవ్ర విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల కమిషన్ (ఈసీ) తనకు నోటీసులు జారీ చేయడంపై ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ స్పందించారు. బీజేపీ ఆదేశాల మేరకే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. శనివారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలపై ఇతర దర్యాప్తు సంస్థలను ఉపయోగించిన మాదిరిగానే ఈసీనీ సైతం బీజేపీ వాడుకుంటోందని విమర్శించారు. ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకుని గతంలో సీబీఐ, ఈడీలను ఉపయోగించిన బీజేపీ ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ఉపయోగిస్తోందని తెలిపారు. వక్రమార్గంలో కాకుండా ఆప్‌తో బీజేపీ నేరుగా ఎన్నికల్లో పోరాడాలని సవాల్ విసిరారు. దర్యాప్తు సంస్థల వెనక దాక్కోవడం మానుకోవాలని సూచించారు. మనీలాండరింగ్ కేసులకు సంబంధించి బీజేపీ నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటువంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలని తెలిపారు. కేవలం ఆరోపణల ఆధారంగానే ఆప్ నేతలను అరెస్టు చేశారని తెలిపారు. కాగా, తనను బీజేపీలో చేరాలని లేకపోతే నెలరోజుల్లో ఈడీ చేత అరెస్టు చేయిస్తామని కాషాయ పార్టీ సన్నిహితులను సంప్రదించిందని అతిశీ గతంలో వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఈసీ అతిశీకి నోటీసులు జారీ చేసింది.