ఏడు రాష్ట్రాల్లో బైపోల్స్.. వివరాలు ప్రకటించిన ఈసీ

by Shamantha N |
ఏడు రాష్ట్రాల్లో బైపోల్స్.. వివరాలు ప్రకటించిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మరోసారి ఎన్నికల కోసం ఈసీ రెడీ అయ్యింది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. జూలై 13న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 10 చోట్ల ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరో మూడు చోట్ల శాసనసభ సభ్యులు మరణించారు. దీంతో, ఆ ప్రాంతాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. జాన్ 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 21 నామినేషన్లకు చివరితేదీ కాగా.. జూన్ 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూన్ 26 వరకు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. జూలై 10న పోలింగ్ జరగగా.. జూలై 13న ఫలితాలు విడుదల కానున్నాయి.

ఉపఎన్నికలు ఎక్కడంటే?

బిహార్ లోని రుపౌలీ, పశ్చిమ బెంగాల్ లోని రాయ్ గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్ద, మానిక్ తలా నియోజకవర్గాలకు బైపోల్స్ జరగనున్నాయి. ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, మంగ్లౌర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులోని విక్రవాండీ, మధ్యప్రదేశ్ లోని అమర్ వాడా, పంజాబ్ లోని జలందర్ వెస్ట్, పిమాచల్ ప్రదేశ్ లోని డెహ్రా, హమీర్ పుర్, నాలాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బైపోల్స్ జరగనున్నాయి. మానిక్ తలా, విక్రవాండీ, మంగ్లౌర్ స్థానాల్లో ఎమ్మెల్యేలు చనిపోయారు. మిగతా పది చోట్ల రాజీనామా చేశారు.

Advertisement

Next Story