Earthquake: ఆ రాష్ట్రంలో భూకంపం.. తప్పిన పెను ప్రమాదం

by Shiva |
Earthquake: ఆ రాష్ట్రంలో భూకంపం.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట నిత్యం భూకంపాలు సంభవిస్తున్నాయి. కాగా, వాటి ప్రభావం ఎక్కువగా నార్త్ ఇండియాలోనే కనిపిస్తోంది. తాజాగా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పితోర్‌గఢ్‌లో మంగళవారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియక ఎక్కడి వారు అక్కడే నిలబడిపోయారు. భూకంపం ప్రభావం రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రకంపనలు ఉదయం 6.43 గంటలకు సంభవించాయని తెలిపింది. భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

Read More..

రెమాల్ తుఫాను బీభత్సం.. బంగ్లాదేశ్ లో 10 మంది మృతి



Next Story