- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dress Code: మంత్రులకు డ్రెస్ కోడ్ ఉంటుందా?
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు(Tamil Nadu) డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్(Deputy CM Udhayanidhi Stalin) ధరించిన వైట్ టీషర్ట్ పై వివాదం రగులుతున్నది. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా డీఎంకే(DMK Party) ఎన్నికల గుర్తు ఉన్న వైట్ టీషర్ట్‌ను ఉదయనిధి స్టాలిన్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెన్నై లాయర్ ఎం సత్యకుమార్ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి డ్రెస్ కోడ్ ఉంటుందా? అనే విషయంపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
2019 జూన్ 1వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ ప్రకారం ప్రభుత్వ సేవకులు డ్రెస్ కోడ్ ధరించాలని ఉన్నది. కానీ, ప్రజా సేవకులకు ఈ షరతు వర్తించదని అడ్వకేట్ జనరల్ పీఎస్ రామన్ వాదించారు. అందులోనూ టీషర్ట్‌లు అభ్యంతరకరమైన దుస్తులుగా పేర్కొనలేదని వివరించారు. తదుపరి విచారణలో మంత్రులకు డ్రెస్ కోడ్ ఉన్నట్టు చెప్పే నిబంధనలు ఏవైనా ఉంటే ప్రస్తావించాలని అడ్వకేట్ జనరల్, పిటిషనర్లకు సూచించింది. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు సాంప్రదాయమైన పంచకట్టు కట్టాలని, క్యాజువల్ డ్రెస్‌లు ధరించడం మానుకుని ప్రజా జీవితంలో సీరియస్ కావాలని ఏఐఏడీఎంకే హితవులు పలికింది.