- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నది. ఎలాగైనా ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కూటమి ఏర్పాటు చేసి మరీ బరిలో నిలిచింది. వ్యూహాత్మకంగా అడుగులు వేసి దేశ వ్యాప్తంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అర్విందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకుగాను తాను పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆప్‌తో పొత్తును ఢిల్లీ యూనిట్ అంగీకరించలేదని వెల్లడించారు. ఈ మేరకు ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై నిరాధార అవినీతి ఆరోపణలతోనే ఆ పార్టీ ఏర్పాటయిందని చెప్పారు. అలాంటి పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు.. పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడాన్ని తప్పుబట్టారు.