పాక్‌ను నమ్మొద్దు.. అమెరికాకు భారత్ సూచన

by Vinod kumar |
పాక్‌ను నమ్మొద్దు.. అమెరికాకు భారత్ సూచన
X

న్యూఢిల్లీ: పాశ్చాత్య ఆయుధాలు, సాంకేతికత విషయంలో పాకిస్థాన్‌ను నమ్మొద్దని అమెరికాకు భారత్ సోమవారం సూచించింది. వాటిని ఆ దేశం దుర్వినియోగం చేసి, ప్రాంతీయ అస్థిరత నెలకొల్పే ప్రమాదం ఉందని వెల్లడించింది. యూఎస్ రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కలిసి ఆస్టిస్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇందులో భాగంగా ఇండో-పసిఫిక్, ప్రాంతీయ భద్రతలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. పొరుగున ఉన్న పాక్, చైనాతో భారత సంబంధాలపైనా చర్చించారు. ఈ సమయంలోనే వెస్టర్న్ దేశాల ఆయుధాల విషయంలో పాక్‌ను నమ్మరాదని భారత లీడర్లు సూచించారు.

Advertisement

Next Story