- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
worst EV: ఈవీ స్కూటర్ తో బెంగళూరు యువతి ఫ్రస్టేషన్.. ఏం చేసిందంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల నాణ్యతపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాను కొనుగోలు చేసిన బైక్ విషయంలో సిబ్బంది సరిగ్గా పట్టించుకోవడం లేదని కడుపు మండిన ఓ కస్టమర్ ఇటీవలే కర్ణాటకలోని కలబుర్గిలో ఏకంగా ఓ షో రూమ్ కు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే బెంగళూరుకు చెందిన ఓ యువతి తాను కొనుగోలు చేసిన ఈవీ స్కూటర్ విషయంలో వినూత్న నిరసనకు దిగింది. తాను కొనుగోలు చేసిన ఓ కంపెనీకి చెందిన స్కూటర్ ప్రతిసారీ రిపేర్ కు వస్తోందని ఈ విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంస్థ ప్రతినిధులు పట్టించుకోవడం లేదని నిషా అనే యువతి అగ్రహం వ్యక్తం చేసింది. ఇది డబ్బా స్కూటర్ అని దయచేసి ప్రజలు దీనిని కొనుగోలు చేయవద్దంటూ ఓ కాగితంపై రాసి స్కూటర్ కు అంతికించింది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా నిషా ఆవేదన ఓలా ఎలక్ట్రిక్ పై దాని కస్టమర్లలో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం అని పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. యువతి చేపట్టిన చర్య నెంబర్ 1 స్టార్ రివ్యూ అని ఓ నెటిజన్ రియాక్ట్ అయితే.. మరో నెటిజన్ స్పందిస్తూ.. గత కొన్ని సంవత్సరాలుగా సదరు ఈవీ సంస్థ ఘోరంగా దిగజారిపోతున్నది. చెత్త ఈవీగా మారుతున్నది. స్కూటర్ కంపెనీ తీరును ఎండగట్టిన ఈ లేడీ స్టాండింగ్ ఒవేషన్ కు అర్హురాలు అంటూ కామెంట్ చేశాడు. నిషా పోస్టు వైరల్ కావడంతో స్పందించిన సదరు సంస్థ ఆమె వెహికిల్ ను రిపేర్ చేసేందుకు తీసుకువెళ్లారు. అప్పటి వరకు తాత్కాలికంగా ఉపయోగించుకునేందుకు మరో వాహనం అందించారు.