- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి పుకార్లు, ఫేక్ వార్తలు నమ్మవద్దు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్టాండప్ కమెడియన్, సినీ నటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శ్రీవాస్తవ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరుతూ ఆయన కుటుంబసభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్యులు శక్తిమేరకు కృషి చేస్తున్నారని, శ్రీవాస్తవ పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. వైద్యులు శ్రీవాస్తవకు చికిత్స అందిస్తూ శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రేమ చూపిస్తూ మద్దతిస్తున్న శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపారు. దయచేసి సోషల్ మీడియా ప్రచారంలో శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఉన్న పుకార్లు/ఫేక్ వార్తలను నమ్మవద్దని కోరారు. అతను ఇప్పుడు స్థిరంగా ఉన్నాడని. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పని లేదని. వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు, తాము త్వరలో ఆయన అభిమానుల కోసం మరింత సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. అయితే ఆగస్టు 9న రాజు శ్రీవాస్తవకు గుండెపోటు రావడంతో వెంటనే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రికి తరలించారు. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు.