- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Putin-Trump: ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించొద్దు.. పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్
దిశ, నేషనల్ బ్యూరో: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. కాగా.. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక ట్రంప్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ (Putin)తో ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరింరచొద్దని పుతిన్ ని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ లో స్టోరీ వచ్చింది. నవంబర్ 7న ఫోర్లిడాలోని తన ఎస్టేట్ నుంచి ట్రంప్.. పుతిన్‌తో ఫోన్ (Trump Spoke With Putin)లో మాట్లాడినట్లు ఆ కథనం వెల్లడించింది. యూరప్ లో అమెరికా మోహరించిన సైనిక సంపత్తి స్థాయిని ట్రంప్ గుర్తుచేసినట్లు పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్ యుద్ధం (Ukraine Russia War)పై పరస్పరం చర్చించి సమస్య పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు సూచించినట్లు తెలిపింది.
ఎన్నికల ప్రచారంలోనూ..
అధికారంలోకి వస్తే ఒక్క రోజులోనే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కామెంట్స్ చేశారు. అందుకు తగ్గట్లే ఆయన ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధాన్ని ప్రారంభించబోనని, దాన్ని ముగించేందుకు సాయం చేస్తానంటూ భరోసానిచ్చారు. అంతేకాకుండా, అదే కాల్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా జెలెన్‌స్కీతో మాట్లాడారు. ఇక, అమెరికా (USA) కొత్త అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్‌నకు పుతిన్ అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన రష్యా అధినేత.. ‘‘ట్రంప్ (Donald Trump) ధైర్యవంతుడు. ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని అన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రాధాన్యంగా మారింది.