యువత దృష్టి మరల్చకండి..ప్రధాని మోడీపై ప్రియాంకా గాంధీ ఫైర్

by vinod kumar |   ( Updated:2024-07-17 15:47:06.0  )
యువత దృష్టి మరల్చకండి..ప్రధాని మోడీపై ప్రియాంకా గాంధీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఫైర్ అయ్యారు. యువత దృష్టిని మరల్చడం మాని.. కొత్త ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..8కోట్ల మందికి ఉపాధి కల్పించి రికార్డు సృష్టించామని చెప్పారు. కానీ అదే ముంబైలో జరిగిన తాజా ఘటన నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 25 ఖాళీల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. నిజంగానే మీరు రికార్డు సృష్టిస్తే సమస్య ఇంత తీవ్రంగా ఎందుకు ఉంది’ అని ప్రశ్నించారు. కాబట్టి ఇప్పటికైనా బూటకపు వాగ్దానాలు చేయడం మానుకోవాలని సూచించారు. దేశ యువత గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కోట్లాది కొత్త ఉద్యోగాలు ప్రస్తుతం అవసరమని వెల్లడించారు.

Advertisement

Next Story