- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గవర్నర్ పై డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక గవర్నర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్ లాగా కాకుండా, బీజేపీకి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నడంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు చేసి పంపిస్తే వాటిలో 15 బిల్లులను వెనక్కి తిప్పి పంపారని విమర్శించారు. బిల్లులపై ఏమైనా అనుమానాలు, ప్రశ్నలు ఉంటే అడిగి తెలుసుకోవాలి గాని ఇలా అన్ని బిల్లులు తిప్పి పంపితే ఎలా అన్నారు. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలా అయితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుందని, ప్రభుత్వాలు ఎందుకు ఉన్నట్టని గవర్నర్ ను సూటిగా ప్రశ్నించారు శివకుమార్. కర్ణాటక గవర్నర్ కేంద్రం చేతిలో పూర్తిగా కీలు బొమ్మగా మారారని విరుచుకు పడ్డారు. కేంద్రం బీజేపీయేతర ప్రభుత్వాలపై కక్ష సాధిస్తుందని, ఈ విధంగా అడ్డుకుంటే ఆయా రాష్ట్రాలు ఎలా అభివృద్ది చెందుతాయని కేంద్రాన్ని నిలదీశారు. ఇకనైనా భగవంతుడు గవర్నర్ కు మంచి బుద్ది ఇవ్వాలని వేడుకుంటున్నానని ఎద్దేవా చేశారు శివకుమార్.