- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బేగంపేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పై చీటింగ్ కేసు
దిశ, రామగిరి : నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు మాయం చేసిన ఘటనలో బేగంపేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మెండె హేమ బేగంపేట బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తుంది. ఆమె గత కొన్ని రోజులుగా అకౌంట్ దారులకు సంబంధించిన డబ్బులను వారి ఖాతాలలో జమ చేయకుండా తన సొంత అవసరాలకు వాడుకోవడం, అదే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ లకు సంబంధించి అకౌంట్ హోల్డర్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్లకు దొంగ పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
దిశ పత్రిక లో వచ్చిన కథనం ద్వారా బాధితుల నుండి సదరు విషయాన్ని గుర్తించిన సంబంధిత అధికారులు విచారణ చేపట్టి 54 మంది బాధితుల ఖాతా నుంచి 34 లక్షల 87 వేల 22 రూపాయలు దుర్వినియోగం చేసినట్లుగా గుర్తించారు. ఈ విషయమై మంగళవారం గోదావరిఖని డివిజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ శ్రీనాథ్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని బుధవారం పోలీసులు మంథని సీఐ రాజు, రామగిరి ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.