Japan Masters 2024 : జపాన్ మాస్టర్స్‌లో పీవీ సింధు బోణీ

by Sathputhe Rajesh |
Japan Masters 2024 : జపాన్ మాస్టర్స్‌లో పీవీ సింధు బోణీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కుమామోటో జపాన్ మాస్టర్స్-2024 టోర్నీలో బోణీ కొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసనాన్‌ను 21-12, 21-18 తేడాతో ఓడించింది. తద్వారా టోర్నీలో ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 38 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధూ ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా బుసనాన్‌పై ఆడిన 20 మ్యాచ్‌ల్లో సింధు 19 మ్యాచ్‌లు గెలిచినట్లుయింది. సింధు తదుపరి మ్యాచ్‌లో జపాన్‌కు చకెందిన నత్సుకి నైదైరాను ఓడించిన కెనడాకు చెందిన మిచెలీ లీతో తలపడనుంది.

Advertisement

Next Story