- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP: రేవంత్, కవితకు బినామీ సృజన్ రెడ్డి.. బీజేపీ నేత రాణిరుద్రమ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavita)కు బినామీగా సృజన్ రెడ్డి(Srujan Reddy) ఉన్నారని, బినామీగా అనేక వ్యాపారాలు చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ(BJP state spokesperson Ranirudrama) ఆరోపణలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం(Nampally BJP state office)లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సృజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ కు బావమరిది అని ఆమె చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(Kalvakurti Lift Scheme) పనులు కూడా సూదిని సృజన్ రెడ్డి(Sudini Srujan Reddy) కంపెనీకే దక్కిన మాట వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) లో కూడా కవిత తో పాటు సూదిని సృజన్ రెడ్డి నిందితుడని రాణి రుద్రమ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం, రేవంత్ రెడ్డి కుటుంబం కలిసి తెలంగాణను దోచుకున్నాయని, ఇంకా దోచుకుంటున్నాయని ఆమె మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) కలిసి అగ్గిరాజేస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. లగచెర్లలో పెట్టాలనుకుంటున్న ఫార్మా కంపెనీ(Pharma Company) సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డిదని ఆమె గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి, సూదిని సృజన్ రెడ్డి, అడికోర్ ఇన్ఫ్రాస్త్రచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో బిజినెస్ పార్టనర్లని ఆమె వ్యాఖ్యానించారు. ఆ కంపెనీ పెట్టినపుడు రేవంత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారన్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు రేవంత్ తన షేర్ ను సృజన్ రెడ్డి పేరిట మార్చారని రాణిరుద్రమ తెలిపారు. లగచర్ల ఘటనలో అమాయక రైతులను రెచ్చగొట్టి దాడులు చేయించి అటు రైతులను ఇటు అధికారులను బలి చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఆమె హెచ్చరించారు. ఇదిలాఉండగా అమృత్ టెండర్లు కేటాయించిన కంపెనీలో కూడా కల్వకుంట్ల భాగస్వామ్యం బినామీ పేర్లతో ఉందని ఆమె ఆరోపించారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఇష్టం లేకనే.. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్, కేంద్ర ప్రభుత్వంపై నెడుతున్నారని చురకలంటించారు. ఆరు గ్యారంటీల అమలు చేతగాక ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ రోజుకో ఉపాయం పన్నుతోఉందని, బీఆర్ఎస్ దానికి సపోర్ట్ చేస్తోందని విమర్శలు చేశారు.