ICC Champions Trophy : ‘ఒక్క మ్యాచ్ బయటి దేశంలో ఆడటానికి వీల్లేదు..’

by Sathputhe Rajesh |
ICC Champions Trophy : ‘ఒక్క మ్యాచ్ బయటి దేశంలో ఆడటానికి వీల్లేదు..’
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో రోజుకో అంశం తెరపైకి వస్తోంది. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోని ఏ ఒక్క మ్యాచ్ బయట దేశాల్లో జరగడానికి వీల్లేదని పీసీబీ(పాకిస్తాన్ క్రికెట్ బోర్డు)కు పాకిస్తాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇదే అంశమై పీసీబీ ఉన్నతాధికారి స్పందిస్తూ.. ‘మా ప్రభుత్వం ఏ ఒక్క మ్యాచ్‌ను ఇక్కడి నుంచి తరలించొద్దని తెలిపింది. సమయం వచ్చినప్పుడు అదే మా నిర్ణయం అవుతుంది. ప్రస్తుతానికి భారత నిర్ణయాన్ని ఐసీసీ మాకు తెలిపింది. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య బాధ్యతలు మాకు ఉన్నాయి.’ అన్నాడు. హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించొద్దని పాకిస్తాన్ ప్రభుత్వం పీసీబీకి తెలిపినట్లు ఆ దేశ క్రికెటర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ ద్వారా తెలిపాడు. టోర్నీ మొత్తాన్ని తమ దేశంలోనే నిర్వహించాలని పాకిస్తాన్ భావిస్తుండగా.. సెక్యూరిటీ కారణాలతో ఆ దేశంలో పర్యటించకూడని నిర్ణయించింది. దీంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ సందిగ్ధంలో పడింది.

టోర్నీ నిర్వహణకు రెండు ప్రపోజల్స్..

పీసీబీ, బీసీసీఐ కామన్ గ్రౌండ్ పొందలేని పక్షంలో టోర్నీ మొత్తాన్ని సౌతాఫ్రికాకు తరలించాలనే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నమెంట్‌ను రెండు జట్లు లేకుండానే నిర్వహించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే అలా చేస్తే భారీగా ఆర్థిక నష్టం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు కేవలం రెండు దేశాలకు ఆర్థిక వనరులను సమకూర్చడమే కాకుండా.. ఐసీసీ, ఇతర దేశాలకు కూడా హెల్తీ రెవెన్యూ అందిస్తాయని చర్చ నడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed