Vaa Vaathiyaar: మరోసారి పోలీస్ పాత్రలో అదరగొట్టిన స్టార్ హీరో.. టీజర్ ఎలా ఉందంటే?

by sudharani |
Vaa Vaathiyaar: మరోసారి పోలీస్ పాత్రలో అదరగొట్టిన స్టార్ హీరో.. టీజర్ ఎలా ఉందంటే?
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య (surya) తమ్ముడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కార్తీ (Karthi).. ప్రజెంట్ వరుస చిత్రాలతో బిజీగా బిజీగా ఉన్నాడు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన కార్తీ ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఖాకి (Khaki), సర్ధార్ (Sardhar) చిత్రాల తర్వాత మళ్లీ పోలీస్ (police) పాత్రలో నటిస్తున్నాడు. ఈ మేరకు కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar). డైరెక్టర్ నలన్ కుమారస్వామి (Nalan Kumaraswamy) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి శెట్టి (Kirti Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది.

స్టూడియో గ్రీన్ (Studio Green) పతాకంపై కెఇ జ్ఞానవేల్ (KE Gnanavel) రాజా నిర్మిస్తున్న సినిమాలో సత్యరాజ్ (Satyraj), రాజ్ కిరణ్ (Raj Kiran), జిఎం సుందర్ (GM Sundar) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ (First Look)ను రిలీజ్ చెయ్యగా సోషల్ మీడియా (Social Media)లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే జోష్‌లో తాజాగా టీజర్ (teaser)ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్‌లో కార్తీ మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.



Advertisement

Next Story