- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ దేశం రగులుతూనే ఉండాలా..? సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: హిందూ మతం ఒక జీవన విధానం అని.. దీంట్లో మతోన్మాదం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశంలో విదేశీయుల అక్రమణదారుల పేరు కలిగిన నగరాలు, చారిత్రక ప్రదేశాల పేర్లు మార్చేందుకు రీనేమింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ కెఎమ్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దేశ చరిత్ర ప్రస్తుత, భవిష్యత్తు తరాలను వెంటాడకూదని అభిప్రాయపడింది. అసమానతను మాత్రమే సృష్టించే గతాన్ని తిరిగి తవ్వకండి అంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. గతాన్ని తవ్వడం ద్వారా ఈ దేశం రగులుతూనే ఉండాలా అని ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు విరుద్ధంగా ఈ పిటిషన్ ఉందని పేర్కొంది. దేశం అనేక ఇతర సమస్యలను ఎదుర్కొంటోందని వాటిని ముందుగా పరిష్కరించాలని, ఒక మతాన్ని ఇందులోకి లాగవద్దని పేర్కొంది.