- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మణిపూర్ ని విభజించకుండానే విభేదాలు పరిష్కరించాలి- అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు హోంమంత్రి అమిత్ షా. జాతి కలహాలతో మణిపూర్ అల్లకల్లోల్లంగా మారిందన్నారు. మణిపూర్ ను విచ్ఛిన్నం చేయాలనుకునేవారికి.. ఐక్యంగా ఉంచే శక్తుల మధ్య లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఇంఫాల్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు అమిత్ షా.
ఈశాన్య రాష్ట్రంలో జనాభాను మార్చేందుకు చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అన్ని వర్గాలను కలుపుకుని రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడమే మోడీ ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. ఈశాన్య ప్రాంతాలు, మణిపూర్ ల పరిస్థితి మారినప్పుడే దేశభవితవ్యం మారిపోతుందన్నారు. ఇన్నర్ మణిపూర్ మరియు ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజల్ని కోరారు అమిత్ షా.
ఎస్టీ హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా హిల్ డిస్ట్రిక్స్ లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించినప్పుడు ఘర్షణలు చెలరేగాయి. గతేడాది మే 3న జరిగిన ఘర్షణల్లో దాదాపు 219 మంది చనిపోయారు.
సుప్రీంకోర్టుని ఆశ్రయించిన మణిపూర్ వాసులు
లోక్‌సభ ఎన్నికల కోసం 18వేల మంది నిర్వాసితులకు ఓటింగ్ సౌకర్యం కల్పించాలన్న పిటిషన్ కొట్టివేసింది సుప్రీంకోర్టు. మణిపూర్‌లో జాతి కలహాల కారణంగా నిర్వాసితులైన వారికి ఓటింగ్ కల్పించాలని పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది సీజేఐ ధర్మాసనం. మణిపూర్ వెలుపల స్థిరపడిన నిర్వాసితులకు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేలా ఈసీని ఆదేశించాలని మణిపూర్ నివాసులు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. నిర్వాసితులు నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయాలని పిటిషన్ లో అభ్యర్థించారి. కానీ, ఆ పిటిషన్ ను స్వీకరించలేమంది సుప్రీంకోర్టు. చాలా ఆలస్యంగా తమని ఆశ్రయించారని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.ఈ దశలో ఎలాంటి జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
ఇకపోతే, మణిపూర్‌లోని రెండు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19, 26 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.