- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dengue Vaccine: దేశ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్ .. డెంగీకి త్వరలోనే సింగిల్ డోస్ వ్యాక్సిన్
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య డెంగీ జ్వరాలు దేశ ప్రజలను వణికిస్తున్నాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా డెంగీ జ్వరం అందరికీ వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా డెంగీ జ్వరం ఈడెన్ అల్బోపిక్టస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇవి రాత్రి కాకుండా కేవలం పగటి పూట మాత్రమే కుడతాయి. అయితే, జ్వరం వచ్చిన వారు చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆ తరువాత తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మం ఎర్రబడటం వంటి లక్షణాలతో తీవ్ర అనారోగ్యం బారిన పడతారు. ఈ క్రమంలోనే డెంగీ జ్వరానికి చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను కనిపెట్టారు.
ఇప్పటికే ఆ వ్యా్ నిపుణుల పరిశోధనలు దాదాపు ముగింపు దశకు వచ్చేశాయి. కాగా, డెంగీ జ్వరానికి 2022లోనే అమెరికాలో డెంగ్ వ్యాక్సియా పేరుతో ఓ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కానీ, దానిని 9 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు మాత్రమే ఇవ్వాలనే నిబంధన ఉంది. అంతేకాకుండా, ఒకసారి డెంగీ వచ్చిన వారికి మాత్రమే ఆ వ్యాక్సిన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. మళ్లీ అదే వ్యాక్సిన్ ఇస్తే.. వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు మరో వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు ముమ్మరంగా పరిశోధనలు చేపడుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే డెంగీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని సమాచారం.