కర్ణాటకను కలవర పెడుతున్న డెంగ్యూ

by M.Rajitha |
కర్ణాటకను కలవర పెడుతున్న డెంగ్యూ
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో భారీగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూను అంటువ్యాధిగా పేర్కొంది ప్రభుత్వం. గతేడాది 5 వేల డెంగ్యూ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 25 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గత దశబ్దకాలంలో ఇన్ని కేసులు నమోదవడం ఇదే ప్రథమం. డెంగ్యూ కేసుల తీవ్రత అధికంగా పెరుగుతున్నందున ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు సిద్దమైంది. తక్షణమే రాష్ట్రమంతటా దోమల నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఫాగింగ్ చేయడం, దోమల లార్వాలను చంపేందుకు నీరు నిలవ ఉన్న ప్రదేశాలలో రసాయనాలు స్ప్రే చేయడం వంటివి అధికం చేయాలని అధికారులకు సూచించింది. గ్రామాల్లో, పట్టణాల్లో దోమలను అరికట్టే నిబంధనలను ఉల్లంఘిస్తే ఇకనుండి భారీగా జరిమానా విధించనుంది. దోమలు పెరిగే స్థావరాలు ఉంటే ఆయా భవన యాజమాన్యాలకు, వ్యాపార సముదాయాలకు మొదట జరిమానా విధించి, తీరు మార్చుకోక పోతే వాటిని సీజ్ చేయనున్నారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Next Story

Most Viewed