- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో కాంగ్రెస్ అధ్వర్యంలో ప్రతిపక్షాల భారీ ఎత్తున ర్యాలీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన చేపట్టాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అని పేర్కొంటున్న బ్యానర్‌ను ప్రదర్శిస్తూ విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు శుక్రవారం నిరసనగా మార్చి నిర్వహించారు. మరోవైపు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మార్చ్‌కు ఎలాంటి అనుమతి లేదని పేర్కొంటూ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.
అదానీ నివేదికపై జేపీసీ కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధాని ప్రజల నుంచి ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మెహుల్ ఛోస్కీలు ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి దేశం విడిచారు. దీనిపై ప్రధాని ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడలేదు అని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రపతి కూడా వారిని కలిసేందుకు ఎలాంటి సమయం కేటాయించలేదని పేర్కొన్నారు.
కాగా, విపక్ష పార్టీలు అదానీ-హిండెన్ బర్గ్ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని కోరుతున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కాగా, వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.