Kamala Harris: యూఎస్ అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్..! మరి ట్రంప్ ఏం చేస్తారు..?

by karthikeya |
Kamala Harris: యూఎస్ అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్..! మరి ట్రంప్ ఏం చేస్తారు..?
X

దిశ, వెబ్‌డెస్క్: కొద్ది రోజుల క్రితం పూర్తయిన యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లతో సూపర్ విక్టరీ సాధించి రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌ (226 ఎలక్టోరల్ ఓట్లు)ను చిత్తుగా ఓడించిన ఆయన మరి కొద్ది రోజుల్లో ఆగ్రరాజ్యానికి 47వ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు. కానీ ఇలాంటి టైంలో యూఎస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యరిస్‌ను చేయాలంటూ డిమాండ్లు రావడం చర్చనీయాంశంగా మారింది.

అసలు విషయం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయడానికి ఇంకొన్ని వారాలు ఉంది. అప్పటివరకు డెమోక్రటిక్ పార్టీనే అధికారంలో ఉంటుంది. అంటే అప్పటివరకు జో బైడెన్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారన్నమాట. అయితే మిగిలి ఉన్న ఈ కొద్ది వారాల పాటు బైడెన్‌ను ప్రెసిండెట్‌గా తొలగించి కమలా హారిస్‌ (Kamala Harris)కు ప్రెసిడెంట్‌ పగ్గాలు అప్పగించాలని ఆమె మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌ జమాల్‌ సిమన్స్‌ సూచించారు.

ఇటీవల ఓ టాక్‌ షోలో మాట్లాడిన ఆయన.. బైడెన్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఉపాధ్యక్షురాలు హారిస్‌ను ఆ బాధ్యతలు అప్పగించి యూఎస్ ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్‌ని చేయాలని సూచించారు. ‘‘ఇప్పటివరకు జో బైడెన్‌ (Joe Biden) అద్భుతంగా పరిపాలించారు. కానీ, ఆయన తన చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. కొద్ది వారాలపాటు మిగిలున్న పదవీకాలాన్ని ఆయన కమలా హ్యారిస్ కోసం త్యాగం చేయాలి. ఆయన తన పదవికి ఇప్పుడే రాజీనామా చేసి కమలా హ్యారిస్‌కు అప్పగించాలి. అలా చేస్తే రాబోయే కాలంలో అధ్యక్ష ఎన్నికల పోటీలో మహిళలు నిలవడానికి మార్గం వేసిన వాళ్లవుతారు’’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story