- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రచారానికి హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు ఫుల్ గిరాకీ.. గంటకు రూ.5.25 లక్షలు
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు తమ ప్రచారాల కోసం వివిధ ప్రాంతాలకు తిరగడానికి చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్‌లను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో వీటి డిమాండ్ ప్రస్తుతం 40 శాతానికి పైగా పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క చార్టర్డ్ విమానాల డిమాండే 30-40 శాతం ఎక్కువగా ఉంది. దీంతో చార్జీల విషయంలో కూడా పెరుగుదల ఉంది. గంటల ప్రతిపాదికన డిమాండ్‌ను బట్టి చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం, సాధారణంగా సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్‌లకు గంటకు సుమారు రూ.80,000 నుండి 90,000 వరకు ఉంటుంది, కానీ ఎన్నికల సమయంలో రూ.1.5 లక్షల వరకు చార్జ్ చేస్తున్నారు.
సాధారణ రోజుల్లో ట్విన్-ఇంజన్ హెలికాప్టర్‌లకు రూ. 1.7 లక్షలు ఉండగా, ఇప్పుడు దాదాపు రూ.3.5 లక్షల కంటే ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. చార్టర్డ్ విమానాల ధరలు కూడా గంట ప్రాతిపదికన భారీగా వసూలు చేస్తున్నారు. ఎన్నికల వల్ల చార్టర్డ్ విమానాల గంట ధర రూ.5.25 లక్షల కంటే ఎక్కువగా ఉంది. ఒకే ఇంజన్ హెలికాప్టర్‌లో పైలట్‌తో సహా 7 మంది వరకు కూర్చునే సామర్థ్యం ఉంటుంది. అదే, ట్విన్ ఇంజన్ హెలికాప్టర్‌లో 12 మంది వరకు కూర్చోవచ్చు.
ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు విమానాలను ఎక్కువగా ఉపయోగించడంతో, చార్టర్డ్ విమానాల ఆపరేటర్ల ఆదాయాలు సాధారణ సమయాలతో పోలిస్తే 15-20 శాతం కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో హెలికాప్టర్ల వినియోగం ఎక్కువగా కనిపిస్తోందని రోటరీ వింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కెప్టెన్ ఉదయ్ గెల్లి చెప్పారు.
2019 లోక్‌సభ ఎన్నికలలో, భారత ఎన్నికల సంఘంకి సమర్పించిన పార్టీ వార్షిక ఆడిట్ ఖాతాల ప్రకారం, బీజేపీ తన ప్రచారాలకు విమానం/హెలికాప్టర్‌ల కోసం మొత్తం రూ. 250 కోట్లకు పైగా ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో ప్రయాణానికి రూ. 126 కోట్లు ఖర్చు చేసింది.