- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెన్సార్ ఎర్రర్ వల్లే ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరభారతంలో భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేశ్ పూర్ లోని టెంపరేచర్ మానిటరింగ్ స్టేషన్ లో అత్యధికంగా 52.9 డిగ్రీలు నమోదైనట్లు చూపించింది. అయితే, ఆ ఉష్ణోగ్రత వివరాలు తప్పని కేంద్రం ప్రకటించింది. సెన్సార్ సరిగ్గా పనిచేయకపోవడమే దానికి కారణం అని కేంద్రంమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.
సెన్సార్ ఎర్రర్ వల్లే 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత
మే 29న ముంగేశ్ పూర్‌లో నమోదైన 52.9 డిగ్రీల ఉష్ణోగ్రతపై ఐఎండీ విచారణ జరిపిందని కిరణ్ రిజిజు అన్నారు. సెన్సార్ ఎర్రర్ వల్ల మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైనట్లు గుర్తించామన్నారు. సెన్సార్ ఎర్రర్ గురించి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. టెంపరేచర్ వివరాలు కచ్చితత్వంతో ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిపైనే ఇటీవలే ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం. మహాపాత్ర స్పందించారు. సెన్సార్ ఎర్రర్ పై వర్కౌట్ చేస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీలో 20 చోట్ల మానిటరింగ్ స్టేషన్లు
ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. 20 చోట్ల మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే, ముంగేశ్ పూర్ లో అత్యధికంగా 52.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది. కాగా.. మరో 14 చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. కొన్నిచోట్ల 45-50 మద్య ఉష్ణోగ్రతలు నమోదైంది. ముంగేశ్ పూర్ లో నమోదైన డేటా ఇతరప్రాంతాల కన్నా భిన్నంగా ఉంది. దీనిపై విచారణ జరపగా.. సెన్సార్ ఎర్రరే కారణమని తేలింది.