Delhi riots case : ఢిల్లీ అల్లర్ల కేసు సీబీఐకి బదిలీ..హైకోర్టు కీలక నిర్ణయం

by vinod kumar |
Delhi riots case : ఢిల్లీ అల్లర్ల కేసు సీబీఐకి బదిలీ..హైకోర్టు కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: 2020లో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో 23 ఏళ్ల ఫైజాన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తును ఢిల్లీ హైకోర్టు మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు బదిలీ చేసింది. ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు చేసిన పని చాలా తక్కువ అని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో దర్యాప్తు ఆలస్యంగా, స్కెచ్‌గా ఉందని, పిటిషనర్ కుమారుడిపై క్రూరంగా దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను సులభంగా తప్పించినట్టు తెలుస్తోందని న్యాయ్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీబీఐకి బదిలీ చేస్తున్నట్టు తెలిపింది.

కాగా, ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పైజాన్ సహా మరో నలుగురిని పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు ఆరోపణలున్నాయి. వీరందరినీ అదుపులోకి తీసుకుని జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అనంతరం పోలీసు కస్టడీ నుంచి విడుదలైన తర్వాత ఫైజాన్ మరణించాడు. దీంతో ఆయన తల్లి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు కొట్టడం వల్లు తన కుమారుడు మృతి చెందాడని ఆరోపించింది. దీంతో అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఫైజాన్‌ను రాత్రిపూట పోలీస్ స్టేషన్‌లో ఉంచినప్పుడు అతనికి ఏమైనా జరిగిందా అని ప్రశ్నించింది. ఈ సమస్యను పోలీసులు నీరుగార్చినట్లు కనిపిస్తోందని పేర్కొంది.



Next Story