- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నషా చోడో! నడిరోడ్డుపై డ్రగ్స్ తీసుకో..! ఇంజెక్షన్ తీసుకుంటున్న ఇ-రిక్షా డ్రైవర్
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో డ్రగ్స్ సమస్య నాటి నాటికి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు డ్రగ్స్ అనే మాటే లేకుండా చేస్తామని చెబుతున్నా కూడా.. కొందరు విచ్చల విడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఘటనలు సోషల్ మీడియాలో కన్పిస్తున్నాయి. అయితే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డుపై ఇ-రిక్షా డ్రైవర్ ఇంజెక్షన్‌తో డ్రగ్ తీసుకుంటు కెమరాకు చిక్కాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. అతడి ఈ రిక్షా వాహనం వెనుక వైపు ‘నషా చోడియే’ డ్రగ్ డి-అడిక్షన్ అడ్వటైజ్మెంట్ స్టిక్కర్ అంటించి ఉంది. దీనికి సంబంధిచిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నషా చోడియో అని వాహనంపై అడ్వటైజ్ ఉంది.. అతను మాత్రం నడిరోడ్డుపై ఇంజెక్షన్‌తో డ్రగ్స్ తీసుకుంటాడు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు నెటిజన్లు ఫిర్యాదు చేశారు. దేశ రాజధానిలో పట్టపగలు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఈ సందర్భంగా నెటిజన్లు ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మరికొందరు అది డ్రగ్స్ కాదని అతను నార్మల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.