Rohini School Blast: ఢిల్లీ పేలుడు వెనుకాల ఖలిస్థానీ గ్రూపు హస్తం

by Shamantha N |
Rohini School Blast:  ఢిల్లీ పేలుడు వెనుకాల ఖలిస్థానీ గ్రూపు హస్తం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్‌ విహార్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ పాఠశాల వద్ద పేలుడు ఖలిస్థానీ గ్రూపు బాధ్యత తీసుకున్నారు. ‘జస్టిస్‌ లీగ్‌ ఇండియా’ అనే ఖలిస్థానీ అనుకూల గ్రూపు బాధ్యతను తీసుకొంది. దీనికి సంబంధించిన మెసేజ్‌లు కొన్ని టెలిగ్రామ్‌ గ్రూపుల్లో ప్రత్యక్షమైనట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ గ్రూపులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని టెలిగ్రామ్‌కు ఇప్పటికే అధికారులు లేఖలు రాశారు. ఖలిస్థానీ వేర్పాటువాదుల హత్యకు ప్రతీకారంగా దుండగులు ఈ చర్యను చేపట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ‘‘కొందరు గూండాలతో భారత నిఘా ఏజెన్సీ మా నోళ్లు మూయించాలని చూస్తే.. ప్రపంచంలో ఉన్న అత్యంత మూర్ఖులు వారే. మేం వారికి ఎంత దగ్గరగా ఉన్నామో ఏమాత్రం ఊహించలేరు. ఏక్షణమైనా దాడి చేయగల సత్తా మాదగ్గర ఉంది. ఖలిస్థాన్‌ జిందాబాద్‌’’ అనే మెసేజ్ ని కూడా టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు.

అనుమానితుడి గుర్తింపు

అయితే, పోలీసుల దర్యాప్తులో మాత్రం ఎలాంటి ఆర్గనైజేషన్‌ గ్రూప్‌ పేరు వెల్లడికాలేదు. అయితే, అది తక్కువ శక్తి ఉన్న ఐఈడీగా భావిస్తున్నారు. రిమోట్‌ కంట్రోల్‌, టైమర్‌ వంటివి వాడి పేలుడుకు పాల్పడి ఉండొచ్చనే అంచనాలున్నాయి. ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడానికే ఈ పనిచేసినట్లు భావిస్తున్నారు. తెల్ల టీషర్ట్‌ ధరించిన ఓ అనుమానితుడిని గుర్తించారు. పేలుడు జరగడానికి ముందు రోజు రాత్రి ఆ ప్రాంతంలో అతడు ఏదో చేస్తున్నట్లు ఆ దృశ్యాల్లో ఉంది. ఇకపోతే, ఆదివారం ఉదయం 7:50 గంటలకు జరిగిన ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో ఫోరెన్సిక్‌ బృందాలు, క్రైమ్, బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. పాఠశాల సమీపంలోని మట్టి, అక్కడ గుర్తించిన తెల్లని పౌడర్‌ నమూనాలనూ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇకపోతే, ఢిల్లీ నగరంలో హై అలర్ట్‌ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed