- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi Police: అల్-ఖైదా కార్యకలాపాలపై ఢిల్లీ పోలీసులు దాడులు.. 11 మంది అరెస్టు
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ పోలీసులు గురువారం అల్-ఖైదా గ్రూప్ కార్యకలాపాలను ఛేధించింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన ఢిల్లీ పోలీసులు మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అల్-ఖైదా వ్యూహారం ప్రకారం, రాంచీకి చెందిన ఇష్తియాక్ అనే డాక్టర్ నేతృత్వంలోని ఈ గ్రూప్ 'ఖిలాఫత్ ' ప్రకటించాలని, దేశంలో తీవ్రవాద కార్యకలాపాలను అమలు చేయాలనే లక్ష్యాలను కలిగి ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు జాతీయ మీడియాతో చెప్పారు. మూడు రాష్ట్రాల్లో 15 చోట్ల ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీమ్‌లు దాడులు నిర్వహించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో ఏకే-47 రైఫిల్, రివాల్వర్, కాట్రిడ్జ్‌లు, డమ్మీ ఇన్సాస్ రైఫిల్, ఎయిర్ రైఫిల్, కొన్ని వైర్లు, టెబుల్ వాచ్ సహా పలు రకాల వస్తువులు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదులు అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ పొందారని పోలీసులు వెల్లడించారు. రాజస్థాన్‌లోని భివాడిలో ఆయుధ శిక్షణ పొందుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.