Delhi Municipality: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన ఎఫెక్ట్.. 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్

by Shiva |   ( Updated:2024-07-29 04:06:20.0  )
Delhi Municipality: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన ఎఫెక్ట్.. 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌ను వరద నీరు ముంచెత్తడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు ప్రాణాలు విడిచారు. దీంతో ఆ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్‌ దేశ్‌పాల్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్కింగ్, సరుకు నిల్వ పేరుతో అక్రమంగా లైబ్రరీ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రైనేజీ ఆక్రమణల వల్లే రావూస్ కోచింగ్ సెంటర్‌లో వరద నీరు పోటెత్తినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే ఘటనపై దేశ వ్యాప్తంగా నిరననలు వెల్లువెత్తడంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రాంతంలో బేస్‌మెంట్లలో అక్రమంగా నడిపిస్తున్న మొత్తం 13 కోచింగ్ సెంటర్లను గుర్తించి వాటికి సీల్ వేసినట్లుగా ఎంసీడీ అడిషనల్ కమిషనర్ తారిఖ్ మసూద్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్ నిర్వహించడం వల్లే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed