భారీగా పెరిగిన ఎమ్మెల్యేల జీతాలు

by Harish |
భారీగా పెరిగిన ఎమ్మెల్యేల జీతాలు
X

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శాసన సభ్యులకు గుడ్ న్యూస్ అందింది. వారి జీతాలు 66 శాతం పెంచాలనే ప్రభుత్వ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. దేశంలో అత్యంత తక్కువగా జీతం తీసుకుంటున్న వారిలో ఒకరైన ఢిల్లీ ఎమ్మెల్యేలు తాజా పెంపుతో అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.54,000 నుంచి రూ.90,000 అందుకోనున్నారు. దీంతో పాటు మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విపక్ష నేతలు కూడా అన్నింటిని కలుపుకుని రూ.72,000 నుంచి ఏకంగా రూ.1.70 లక్షలకు పెరిగింది. వీటితో పాటు కుటుంబ వార్షిక ప్రయాణాల రీయింబర్స్, నివాసాలకు అద్దె ఇతరత్రా కూడా పెంచారు. గత ఏడాది జులైలో ఎమ్మెల్యేల జీతాలు పెంచాలని ఢిల్లీ అసెంబ్లీ బిల్లులు పాస్ చేసింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదం తో ఢిల్లీలో 12 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేల జీతం పెరిగింది. సంబంధింత శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ పెరిగిన జీతం మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకు ఫిబ్రవరి 14, 2023 నుండి అమల్లోకి వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed