Delhi Liquor Scam Case: బెయిల్ వస్తుందా.. రాదా! కవిత మద్యంతర బెయిల్‌పై రేపే తీర్పు

by Shiva |
Delhi Liquor Scam Case: బెయిల్ వస్తుందా.. రాదా! కవిత మద్యంతర బెయిల్‌పై రేపే తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు వెల్లడిస్తారు. కాగా, ఏప్రిల్ 16 వరకు తన కొడుకుకు పరీక్షలు ఉన్నాయంటూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరిన సంగతి తెలిసిందే. రేపు న్యాయమూర్తి బెయిల్‌పై ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారన్న దానిపై బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

కాగా.. కవితకు లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వద్దని ఈడీ కోర్టు ముందు వాదనలు వినిపించింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ పేర్కొంది. లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని.. డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారని.. ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్లై ద్వారా కవిత 33 శాతం వాటా పొందిందని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. కవిత తనకు సంబంధించి ఎటువంటి వివరాలు ఈడీకి చెప్పొద్దని కేసులో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని బెదిరించారని, ఇలాంటి సమయంలో కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ అభిప్రాయపడింది. దీంతో ఇరుపక్షాల వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా.. రేపు మధ్యంతర బెయిల్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed