- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: సిసోడియాకు రిమాండ్ పొడిగింపు
by Vinod kumar |

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడిషియల్ రిమాండును రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు మే 12వ తేదీ వరకు పొడిగించింది. నేటితో ఆయన జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని సిసోడియా రిమాండ్‌ను పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ అధికారులు కోరారు.
సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సిసోడియా రిమాండ్ మే 12 వరకు పొడిగించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ పలు సార్లు విచారణ చేసిన అనంతరం సిసోడియాను అరెస్టు చేసింది. ప్రస్తుతం మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు.
Next Story