Atishi : కక్ష సాధింపుతోనే అధికారిక నివాసం కేటాయింపు రద్దు.. కేంద్రంపై ఢిల్లీ సీఎం అతిషీ ఆరోపణలు

by Sathputhe Rajesh |
Atishi : కక్ష సాధింపుతోనే అధికారిక నివాసం కేటాయింపు రద్దు.. కేంద్రంపై ఢిల్లీ సీఎం అతిషీ ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కక్ష సాధింపులో భాగంగానే తన అధికారిక నివాసం కేటాయింపును కేంద్రం రద్దు చేసిందని ఢిల్లీ సీఎం అతిషీ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం తనకు ఉత్తర్వులు అందాయని ఆమె పేర్కొన్నారు. రాజకీయ ప్రోద్భలంతోనే పోలింగ్ షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించిన ముందు రోజు ఈ నోటీసులు జారీ అయ్యాయని ఆమె ఆరోపించారు. బీజేపీ తనతో పాటు తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాను సీఎం అయినప్పుడు బీజేపీ నేతలు తన సన్నిహితులను రోడ్డుపైకి లాగారన్నారు. వాళ్లు తమ ఇళ్లను లాక్కోవచ్చని.. చేస్తున్న పనిని అడ్డుకోవచ్చని కానీ.. ప్రజలకు సేవల చేయాలనే తమ సంకల్పాన్ని అడ్డుకోలేరన్నారు. ఢిల్లీ ప్రజల ఇళ్లలో ఉండి వారి కోసం పని చేస్తామన్నారు.

కేజ్రీవాల్‌కు కోపం వస్తుందనే.. బీజేపీ నేత అమిత్ మాలవీయ

అతిషీ ఆరోపణలను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఖండించారు. 6 ఫ్లాగ్ రోడ్డులోని నివాసంలో ఉండేందుకు ఢిల్లీ సీఎం అతిషీ నిరాకరించారన్నారు. కేజ్రీవాల్‌కు ఎక్కడ కోపం వస్తుందో అని అతిషీ అధికారిక నివాసంలోకి మారలేదన్నారు. అతిషీ అబద్ధాలు చెబుతున్నారని.. అధికారిక నివాసంలో ఉండకపోవడం వల్లే తాజాగా కేటాయింపు రద్దు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. దీనికి బదులు మరో రెండు బంగ్లాలను ఢిల్లీ సీఎంకు కేటాయిస్తామని కేంద్రం ప్రతిపాదించినట్లు ఆయన అన్నారు.

Advertisement

Next Story