Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా వీసాను పొడిగించిన భారత్‌

by Shamantha N |   ( Updated:2025-01-08 15:02:44.0  )
Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా వీసాను పొడిగించిన భారత్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)ను పెద్ద రిలీఫ్ దొరికింది. హసీనా వీసాను పొడిగించినట్లు భారత్ ప్రకటించింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత షేక్‌ హసీనా గతేడాది ఆగస్టు నుంచి భారత్ లో నివాసముంటున్నారు. పారిపోయి భారత్ లో తలదాచుకుంటున్న ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్‌ కోరుతున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం జరిగింది. ఆమె బసను సులభతరం చేసేందుకు వీసాను పొడిగించారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, హసీనా ఢిల్లీలోని సేఫ్‌హౌస్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య నివసిస్తున్నారు. ఇకపోతే, జులైలో జరిగిన హత్యలు, కొందరి అదృశ్యాలకు మాజీ ప్రధాని షేక్‌ హసీనా, మరో 96 మంది కారణమని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆరోపించింది. ఇప్పటికే బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ నేర న్యాయస్థానం హసీనాపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. మరోవైపు, షేక్ హసీనా సహా 97 మంది పాస్ పోర్టులను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ఇమిగ్రేషన్ విభాగం మంగళవారం ప్రకటించింది. 2024 నిరసనల సమయంలో బలవంతపు అదృశ్యాలు, హత్యల ఆరోపణలతో యూనస్ ప్రతినిధి అబుల్ కలాం ఆజాద్ మజుందార్ వెల్లడించారు.

Read More ...

Sheikh Hasina : బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా గడువు పెంచిన భారత్


Advertisement

Next Story

Most Viewed