AP News:మద్యం డంప్ కనుగొన్న వేటపాలెం పోలీసులు

by Jakkula Mamatha |
AP News:మద్యం డంప్ కనుగొన్న వేటపాలెం పోలీసులు
X

దిశ ప్రతినిధి, బాపట్ల జిల్లా: మండలంలోని కటారివారిపాలెం శివార్లలోని మద్యం డంప్ నీ వేటపాలెం పోలీసులు బుధవారం సాయంత్రం కనుగొన్నారు. వేటపాలెం ఎస్సై మీసాల వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సాధారణ గస్తీకి కటారివారిపాలెం వెళుతుండగా పోలీసులను చూసి చేతిలో గోనెసంచిలో పారిపోతున్న వ్యక్తిని వెంబడించిన పోలీసులు పట్టుకుని సోదాలు చేయగా సంచిలో కొన్ని మద్యం బాటిళ్లు ఉండటంతో, అతని వివరాలు తెలుసుకుని సోదాలు చేయగా సమీపంలోని పొలంలోని పొదల్లో మద్యం బాటిల్స్ ఉండటం కనుగొన్నారు. విచారణలో దేశాయిపేట పంచాయతీ దంతం పేట గ్రామానికి చెందిన బొడ్డు నాగ శంకర్ గా పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ మద్యం 180 ml బాటిల్స్ 260, 25 బీరు బాటిల్స్ ఉన్నాయి. నాగ శంకర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలు జరిపితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై హెచ్చరించారు. మద్యం డంప్ ను పట్టుకున్న వేటపాలెం పోలీసులను రూరల్ సీఐ శేషగిరిరావు, చీరాల డీఎస్పీ ఎండి మొయిన్ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed