Delhi: పొగమంచులా కమ్మేసిన కాలుష్యం.. ఊపిరి పీల్చేదెలా?

by Rani Yarlagadda |
Delhi: పొగమంచులా కమ్మేసిన కాలుష్యం.. ఊపిరి పీల్చేదెలా?
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఉంటోన్న ప్రజలకు రోజురోజుకూ ఊపిరి కరువవుతోంది. పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులకు జరిమానాను పెంచినా.. ఢిల్లీ కాలుష్యం (Delhi Pollution) మాత్రం అదుపులోకి రావడం లేదు. తాజాగా అక్కడ కనిపించిన దృశ్యాలు.. ఊపిరికే ఊపిరి ఆడట్లేదేమో అనేంతలా ఉన్నాయి. నగరాన్ని కాలుష్యం పొగమంచులా కమ్మేసింది. కాలుష్యానికి మంచు కూడా తోడవ్వడంతో.. కనుచూపు మేరలో ఎదురుగా ఏం ఉందో కనిపించడం లేదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Delhi Air Quality Index) 432 గా నమోదైంది. అయితే.. నిన్న రాత్రి ఎయిర్ క్వాలిటీ 452 ఉండగా.. ప్రస్తుతం 20 పాయింట్లు తగ్గింది. కానీ.. ఢిల్లీ ఇంకా డేంజర్లోనే ఉంది. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (Indira Gandhi International Airport) పరిసరాల్లో 500 మీటర్ల పరిధిలో ఏముందో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా ద్వారక, జహంగిర్ పురి, ముండ్కా, నజఫ్ ఘర్, లజ్ పత్ నగర్, పట్పర్ గంజ్, పంజాబీ బాగ్, ఆర్కే పురం, రోహిణి, వివేక్ విహార్, వాఝీపూర్ లలో ఏక్యూఐ 450కి పైగా ఉంది. గురువారం ఉదయం 6 గంటలకు ఆనంద్ విహార్ లో అత్యధికంగా 473 ఏక్యూఐ నమోదైంది. పట్పర్ గంజ్ లో 472, అశోక్ విహార్ లో 471, జహంగీర్ పురిలో 470 ఏక్యూఐ నమోదైంది.

ఇండిగో (Indigo) సంస్థ.. ఎక్స్ వేదికగా ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణికులు తాము ప్రయాణించాల్సిన విమానాల స్టేటస్ ను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, శీతాకాలంలో కురిసే మంచు కారణంగా రాకపోకలు ఆలస్యం కావొచ్చని పేర్కొంది. అమృత్ సర్, వారణాసి లకు వెళ్లి, వచ్చే విమానాల రాకపోకలు ఆలస్యమవుతాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed