తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి: యూపీ కోర్టులో పిటిషన్

by samatah |
తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి: యూపీ కోర్టులో పిటిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎంతో చరిత్ర కలిగిన తాజ్‌మహల్‌ను తేజో మహాలయ (శివాలయం)గా ప్రకటించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజ్‌మహల్‌లో అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను ఆపివేయాలని, ప్రార్థనా స్థలానికి అనువైన ఇతర పద్ధతులను కూడా నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడు న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తాజ్‌మహల్‌గా గుర్తించబడక ముందే ఈ కట్టడానికి ఎంతో చరిత్ర ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి ఆధారాలుగా పలు పుస్తకాలను కూడా కోర్టుకు అందజేశారు. ఈ పిటిషన్ పై ఏప్రిల్ 9న విచారణ జరగనుంది. అయితే ఆగ్రాలో తాజ్ మహల్ విషయంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని కొట్టివేయగా మరికొన్ని ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, తాజ్ మహాల్ అనేది ఆగ్రా నగరంలో ఉంది. చరిత్ర కారుల ప్రకారం..మొగల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఈ కట్టడాన్ని నిర్మించినట్టు భావిస్తారు.1632వ సంవత్సరంలో మొదలై 1653లో దీని నిర్మాణం పూర్తైనట్టు చెబుతారు.

Advertisement

Next Story

Most Viewed