- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. పబ్లిక్ టాయిలెట్ గుంతలో పడి ముగ్గురు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్‌లోని 15 అడుగుల లోతైన గుంతలో పడి ముగ్గురు వ్యక్తులు పడిపోయారు. ముంబయిలోని సబర్బన్ ప్రాంతమైన మలాడ్ లో 15 అడుగుల లోతైన భూగర్భ మురుగు కాలువలో పడి ఒక యువకుడితో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇద్దరు స్పాట్ లోనే చనిపోగా.. మరో వ్యక్తి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. అంబుజావాడిలోని అబ్దుల్ హమీద్ రోడ్‌లోని మల్వానీ గేట్ నంబర్ 8 వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఈ మురుగు కాలువ పబ్లిక్ టాయిలెట్‌కు 15 అడుగుల దిగువన ఉంది. ఈ మరుగుదొడ్డి నిర్వహణ కాంట్రాక్టర్ చేతుల్లో ఉంది. అండర్ గ్రౌండ్ లో పడిపోయిన ముగ్గురిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిని సూరజ్ కేవత్(18), వికాస్ కేవత్ (20), రాంలాగన్ కేవత్ (45) గా గుర్తించారు. ముగ్గురూ డ్రెయిన్‌ను శుభ్రం చేసేందుకు కాంట్రాక్ట్‌పై తీసుకున్న కూలీలని మల్వానీ పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.