- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను ముందే చెప్పా.. కొత్త సీటు వెతుక్కుంటారని..
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన అమేఠీ నుంచి తన తల్లి సోనియా గాంధీ ఖళీ చేసిన రాయ్‌బరేలీ స్థానానికి మారిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగంగా స్పందించారు. శుక్రవారం పఛిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మోడీ.. ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ అమేఠీ నుంచి పారిపోయారని అన్నారు. 'ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. డరో మత్, భాగో మత్(భయపడద్దు, పారిపోవద్దు)' అని ఎగతాళి చేశారు. విమర్శకులను, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వాడుతోందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ తరచుగా తన ప్రసంగాల్లో 'డరో మత్' అంటుంటారు. ఆ మాటనే మోడీ వ్యంగ్యంగా వాడారు. 'తల్లీ కొడుకులిద్దరూ భయంతో తమ సొంత స్థానాల నుంచి పోటీకి దూరంగా ఉంటారని ఇదివరకే చెప్పాను' అంటూ సోనియా గాంధీని సైతం మోడీ ప్రస్తావించారు. 'కాంగ్రెస్ అతిపెద్ద నాయకురాలు పోటీ చేసే ధైర్యం చేయదని నేను చెప్పాను. ఆమె భయపడి పారిపోతుంది. రాజస్థాన్‌కు వెళ్లి అక్కడి నుంచి రాజ్యసభలోకి ప్రవేశించారని' పేర్కొన్నారు. వాయనాడ్‌లో ఓడిపోతాననే భయం రాహుల్ గాంధీకి ఉంది. అందుకే ఓటింగ్ పూర్తవగానే మూడో సీటు కోసం వెతుకులాట ప్రారంభిస్తారని నేను ముందే చెప్పాను. తన విధేయులు అమేఠీ నుంచి పోటీ చేయమని చెప్పినా భయంతో అక్కడి నుంచి రాయ్‌బరేలీకి వెళ్లారని మోడీ విమర్శించారు.