- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ukraine-Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా సైన్యం.. ధృవీకరించిన నాటో
దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతిచ్చేందుకు ఉత్తర కొరియా రష్యాకు సైన్యాన్ని పంపిందని, కొంతమంది రష్యాలోని కుర్స్క్ ప్రాంతాంలో ఇప్పటికే మోహరించారని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) ధృవీకరించింది. బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి దక్షిణ కొరియా ప్రతినిధి బృందంతో సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ పరిణామం గురించి మాట్లాడిన నాటో సెక్రటరీ-జనరల్ మార్క్ రూటె.. ఇది యుద్ధ తీవ్రతను పెంచే నిర్ణయం, ప్రమాదకరమైన విస్తరణగా కూడా భావించవచ్చన్నారు. అంతేకాకుండా రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం సరైనది కాదని రూటె అభిప్రాయపడ్డారు. దీని గురించి స్పందించిన అమెరికా.. ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా అడుగుపెడితే లక్ష్యాలు మారుతాయని, ఉత్తర కొరియా సైన్యం మద్దతు తీసుకోవడం ద్వారా రష్యా తన బలహీనతను సూచిస్తుందని విమర్శించింది. ఉత్తర కొరియా దళాలను మోహరించిన అప్‌డేట్ తనకు కూడా అందిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.