- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cyrus Mistry మరణించడానికి ముఖ్య కారణం అదే..!!
దిశ, వెబ్‌డెస్క్: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే, రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముంబైకి ప్రముఖ గైనకాలజిస్ట్ అనహిత పండోలే, ఆమె భర్త డారియస్ పండోలే, సైరస్ మిస్ట్రీ, జహంగీర్ పండోలే ఉన్నారని.. కారును అనహిత పండోలే డ్రైవ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముందున్న మరో కార్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కార్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంలో సీటు బెల్ట్ పెట్టుకుని కూర్చొన్న అనహిత పండోలే దంపతులు గాయాలతో బయటపడగా.. వెనుక సీట్లో కూర్చొన్న సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో తలకు బలమైన గాయాలై మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే సైరస్ మిస్ట్రీ మరణానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. కాగా, ఈ ఘటపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మహారాష్ట్రలోని వర్లీ స్మశాన వాటికలో రేపు మిస్త్రీ అంత్యక్రియలు జరగనున్నాయి.