- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాయ్ పెడుతుండగా పేలిన సిలిండర్: తల్లి సహా ముగ్గురు పిల్లలు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. డియోరియా జిల్లాలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలి తల్లితో సహా ముగ్గురు పిల్లలు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..డియోరియా జిల్లా బాలువాని పోలీస్ స్టేషన్ పరిధిలోని దుమ్రీ గ్రామంలో తమ ఇంట్లో ఆర్తీ దేవి అనే మహిళ శనివారం తెల్లవారుజామున టీ పెడుతుండగా గ్యాస్ లీకవడంతో ఒక్క సారిగా సిలిండర్ పేలి పోయింది. దీంతో మంటలు అంటుకుని ఆర్తీ దేవి సహా ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు తర్వాత ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. పిల్లలు నిద్రలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు వెల్లడించారు. మరణించిన వారిని ఆర్తీ దేవీ(35), ఆమె కుమార్తెలు అంచల్(14), సృష్టి(11), కుమారుడు కుందన్ (12)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు.