Fresh Scam Allegations: కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన మరో స్కాం..?

by Shamantha N |
Fresh Scam Allegations: కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన మరో స్కాం..?
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో ముడా కుంభకోణం(MUDA scam) రాజకీయ ప్రకంపనలు రేపింది. అయితే, ఇప్పుడు మరో స్కాం జరిగినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో భారీగా అక్ర‌మాలు(Covid Scam) జ‌రిగిన‌ట్లు తేలింది. వంద‌ల కోట్ల‌లో నిధుల్ని దుర్వినియోగం చేసిన‌ట్లు అప్పటి యడియూరప్ప ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ కున్హా(Justice John Michael D'Cunha) నేతృత్వంలోని క‌మిష‌న్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఆగ‌స్టు 31వ తేదీన సుమారు 1722 పేజీల‌తో కూడిన నివేదిక‌ను సీఎం సిద్ధ‌రామ‌య్య‌కు(Chief Minister Siddaramaiah) అంద‌జేశారు. కాగా.. ఆ రిపోర్టును విశ్లేషించేందుకు కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచార‌ణ నిర్వ‌హించేందుకు క‌మిష‌న్‌కు ఆరు నెల‌ల అద‌న‌పు గ‌డువు ఇచ్చారు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో(winter session of parliament) కూడా ఈ నివేదిక గురించి చర్చించవచ్చని కర్ణాటక ప్రభుత్వం భావిస్తుంది.

జస్టిస్ సిన్హా కమిటీ అధ్యయనం

జ‌స్టిస్ కున్హా ఇచ్చిన నివేదిక‌ను స్ట‌డీ చేయ‌నున్నట్లు కన్నడ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. మ‌రో నెల రోజుల్లోగా నివేదిక ఇచ్చేందుకు ఆ క‌మిటీకి స‌మ‌యాన్ని కేటాయించారు. వంద‌ల కోట్ల‌ల్లో నిధుల‌ను దుర్వినియోగం చేశార‌ని, అనేక ముఖ్య‌మైన ఫైళ్లు క‌నిపించ‌డం లేద‌ని, ఎన్ని ఆదేశాలు ఇచ్చినా.. ఆ రిపోర్టుల‌ను జస్టిస్ కున్హా క‌మిష‌న్ ముందు ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని ఆరోపించారు. జస్టిస్ సిన్హా క‌మిటీ అక్ర‌మాల‌పై అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్లు సీఎం సిద్దరామ‌య్య‌ తెలిపారు. కోవిడ్(Covid) సమయంలో అప్పటి కర్ణాటక ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ. 13 వేల కోట్లు. కాగా.. అధికారికంగా ఎటువంటి సంఖ్యను ప్రస్తావించనప్పటికీ, సుమారు రూ. వెయ్యి కోట్లు స్వాహా చేసినట్లు రూ. వెయ్యి కోట్లు స్వాహా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోవిడ్ స‌మ‌యంలో మందులు, ఎక్విప్మెంట్ కొనుగోళ్ల‌లో భారీ అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ది. జ‌స్టిస్ కున్హా క‌మిష‌న్‌ను ఆగ‌స్టు 2023లో ఏర్పాటు చేశారు. ఇకపోతే, ముడా కుంభకోణంపై బీజేపీ(BJP) విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు జస్టిస్ కున్హా నివేదిక వరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed