- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Israel-Hezbollah: కౌంట్ డౌన్ మొదలైంది.. హెజ్ బొల్లా కొత్త చీఫ్ పై ఇజ్రాయెల్ కామెంట్
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ముదిరిపోతున్నాయి. హెజ్‌బొల్లా, హమాస్(Hamas)లపై ఇజ్రాయెల్ (Israel) భీకరదాడులకు పాల్పడుతోంది. కాగా.. హెజ్ బొల్లా చీఫ్ షేక్ హసన్ నస్రల్లాను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. కాగా.. హెజ్‌బొల్లా (Hezbollah) కొత్త చీఫ్‌గా షేక్ నయీంఖాసీంను నియమించినట్లు ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ రక్షణమంత్రి చేసిన పోస్ట్ ఆందోళనలను రేకిత్తిస్తోంది. కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండడంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు. షేక్ ఖాసీం ఫొటోను షేర్ చేసిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్.. ‘‘ఇది తాత్కాలిక నియామకం మాత్రమే.. దీర్ఘకాలమైతే కాదు’’ అని రాసుకొచ్చారు. ఇక, మరో పోస్ట్‌లో ‘కౌంట్‌డౌన్ మొదలైంది’ అని పేర్కొన్నారు. దీంతో, ఐడీఎఫ్ (IDF) నెక్ట్స్ టార్గెట్ షేక్ ఖాసీం అని తెలుస్తోంది.
మరిన్ని దాడులు జరిగే అవకాశం
హెజ్ బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (IDF) మరిన్ని దాడులకు పాల్పడవచ్చని పరోక్షంగా ఇజ్రాయెల్ సంకేతం ఇచ్చింది. ఇకపోతే, హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లాను ఇటీవల ఐడీఎఫ్ హతమార్చింది. బీరుట్‌లోని దాహియా ప్రాంతంలోని హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయంపై జరిపిన దాడిలో అతడు మృతిచెందాడు. నస్రల్లా మృతి తర్వాత హెజ్‌బొల్లా కొత్త చీఫ్ ఎవరన్న దానిపై తీవ్ర చర్చ జరిగింది. కాగా.. హెజ్‌బొల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన 70 ఏళ్ల ఖాసింనుకొత్త చీఫ్ గా ఎన్నికున్నారు. మరోవైపు, లెబనాన్ (Lebanon)లోని హెజ్‌బొల్లా (Hezbollah) స్థావరాలు, దాని ఆర్థిక వనరులే లక్ష్యంగా గత కొద్ది వారాలుగా ఐడీఎఫ్ భీకర స్థాయిలో యుద్ధం సాగిస్తోంది. ఈ దాడుల్లో హెజ్ బొల్లాకు చెందిన ఆయుధాలు భారీగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. అయితే, మిలిటెంట్ గ్రూపునకు చెందిన 80 శాతం రాకెట్లు, మిసైల్స్ ధ్వంసం అయినట్లు ఐడీఎఫ్ చెబుతోంది. ప్రస్తుతం ఆ ముఠా 20శాతం ఆయుధాలతోనే పోరాడుతోందని యోవ్ గాలెంట్ చెప్పినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి.