రాజ్యాంగ నిర్మాతలకు ఆయన పాలనే స్ఫూర్తి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ

by samatah |
రాజ్యాంగ నిర్మాతలకు ఆయన పాలనే స్ఫూర్తి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రాముడి పాలనే రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన ప్రతిష్ఠాపన వేడుక కోట్లాది మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చిందని తెలిపారు. మన్ కీ బాత్ 109వ కార్యక్రమం సందర్భంగా మోడీ ప్రసంగించారు. అందరి భావం, భక్తి ఒక్కటే.. అందరి హృదయాల్లో రాముడు ఉంటాడు అని వ్యాఖ్యానించారు. ఇటీవల అనేక మంది పాడిన పాటలను రాముడికే అంకితం చేశానని చెప్పారు. జనవరి 22 సాయంత్రం దేశం మొత్తం రామజ్యోతి వెలిగించి దీపావళిని పండుగ జరుపుకున్నట్టు తాను గుర్తించానన్నారు. ఆ సమయంలో దేశ ప్రజల ఐక్యత స్పష్టంగా కనిపించిందని, దేశ అభివృద్ధికి అదే నిదర్శనమని కొనియాడారు. ఇటీవలి కాలంలో పద్మ అవార్డులు పొందిన వారు అట్టడుగు వ్యక్తులేనని తెలిపారు. గత దశాబ్ద కాలంలో పద్మ అవార్డుల విధానం పూర్తిగా మారిపోయిందని.. ప్రజల పద్మంగా మారినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

మహిళా కవాతు అద్బుతం

రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన కవాతు చాలా అద్భుతంగా ఉందని ప్రధాని మోడీ ప్రశంసించారు. మహిళల పరేడ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందని కొనియాడారు.సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఢిల్లీ పోలీసుల మహిళా బృందాలు కవాతు ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరూ గర్వంతో నిండిపోయారు’ అని చెప్పారు. ‘ఈ ఏడాది 13 మంది మహిళా అథ్లెట్లు అర్జున అవార్డు పొందారు. వీరంతా అనేక టోర్నమెంట్లలో పాల్గొని భారతదేశ పతాకాన్ని ఎగురవేశారు’ అని చెప్పారు. ‘స్వయం సహాయక సంఘాలలోనూ మహిళలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed